మహిళలకు మహాలక్ష్మి పథకంతో ప్రయోజనం : హనుమకొండ కలెక్టర్

కలం, వరంగల్ బ్యూరో : రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని హనుమకొండ (Hanumakonda) కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) అన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి పదివేల కోట్ల రూపాయల మేర ఆదా చేరుకోవడంపై హనుమకొండ (Hanumakonda) బస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు జీరో టికెట్ ద్వారా ఉచితంగా ప్రయాణించేందుకు తోడ్పడుతుందని కలెక్టర్ (Collector Chahat Bajpai) తెలిపారు.

మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకొని ఆర్థికంగా లాభపడుతున్నారని తెలిపారు. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందని, అన్ని వర్గాల మహిళలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిత్యం బస్సుల్లో ప్రయాణించే పలువురు మహిళా ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు శాలువాలు, బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రీజనల్ మేనేజర్ ఎస్.భవాని ప్రసాద్, డిప్యూటీ ఆర్‌ఎం (ఆపరేషన్స్) కేశరాజు భాను కిరణ్, వరంగల్ వన్ డిపో మేనేజర్ పుప్పాల అర్పిత, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>