నిజామాబాద్‌లో నితిన్ న‌బీన్ పాద‌యాత్ర ర‌ద్దు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 23న త‌ల‌పెట్టిన‌ బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) పాద‌యాత్ర ర‌ద్ద‌య్యింది. ఈ విష‌యాన్ని నేడు ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ వెల్ల‌డించారు. బీజేపీ ఆధ్వ‌ర్యంలో క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌లో ఈ నెల 23న మహా పాదయాత్ర, బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అయితే క‌రీంన‌గ‌ర్‌లో పాద‌యాత్ర య‌థావిధిగా జ‌రుగ‌నుండ‌గా నిజామాబాద్‌లో మాత్రం కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ర‌ద్ద‌యిన‌ట్లు అర్వింద్ (MP Arvind) వెల్ల‌డించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వచ్చే నెలలో నిజామాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కరీంనగర్‌లో జరగాల్సిన పాదయాత్ర పూర్తిగా షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంద‌ని, ఈ విష‌యంలో అనుమానం అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌లోని వైశ్య భవన్ నుండి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ వరకు ఈ మహా పాదయాత్ర సాగనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఇండియా కూటమి అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఆయా పార్టీల‌ అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా లోక్‌తంత్ర బచావో – అరాచకత్వ హటావో పేరుతో ఈ పాదయాత్రలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా, నిర్మల్‌లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో పాదయాత్రలు పూర్తయ్యాయి.

Also Read : ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ భారీ విరాళం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>