ఘోర రోడ్డు ప్రమాదం.. ORRపై వరుసగా నాలుగు కార్లు ఢీ!

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ (Himayat Sagar) సమీపంలో ఓఆర్ఆర్ పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం (ORR Accident) చోటుచేసుకుంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్న నాలుగు కార్లు ఒకదాని వెనుక ఒకటి బలంగా ఢీకొన్నాయి. సమీపంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్లాస్టింగ్ పనుల కారణంగా బండరాళ్ల ముక్కలు ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి వచ్చి పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

హైవేపై వేగంగా వస్తున్న వాహనదారులు, రోడ్డుపై ఆకస్మాత్తుగా పడిన రాళ్లను గమనించి సడెన్ బ్రేక్ లు వేయగా.. వెనుక వైపు నుంచి వస్తున్న కార్లు అదుపుతప్పి వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నాలుగు కార్ల ముందు, వెనుక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన(ORR Accident) లో ఇద్దరికి కాళ్లు ఫ్రాక్చర్ కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైవేపై చెల్లాచెదురుగా పడిన రాళ్లను, దెబ్బతిన్న వాహనాలను క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించి, కాసేపు నిలిచిపోయిన ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read : ముంబై పార్కులో జంటపై దాడి.. మైనర్లపై కేసు నమోదు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>