ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ భారీ విరాళం

కలం, వెబ్ డెస్క్: ఐఐటీ ఖరగ్‌పూర్‌ (IIT Kharagpur)కు గూగుల్ సంస్థ భారీ విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ పరిశోధనల కోసం 5 మిలియన్ డాలర్లను భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.45 కోట్లు కేటాయించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) విరాళాన్ని ప్రకటించారు. సుందర్ పిచాయ్ ఈ ఐఐటీలోనే చదివి.. అమెరికాకు వెళ్లి గూగుల్ కంపెనీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈవో స్థాయికి ఎదిగారు.

ప్రపంచంలోనే అతి పెద్ద సెర్చింజన్ అయిన గూగుల్ సంస్థకు అధినేత కావడం వెనుక ఐఐటీ ఖరగ్‌పూర్‌(IIT Kharagpur)లో నేర్చుకున్న పాఠాలే ఎంతగానో ఉపయోగపడినట్లు పలు సందర్భాల్లో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఐఐటీ పూర్వ విద్యార్థిగా భారీ విరాళం అందించి గొప్పతనం చాటుకున్నారు. ఈ నిధులతో ఐఐటీలో ఏఐ పరిశోధనలు మరింత వేగవంతం చేయడంతో పాటు భారతీయ భాషల్లో ఏఐని అభివృద్ధి చేయబోతున్నారు.

Also Read : అనిరుధ్​ – కావ్య పెళ్లి.. ఉద్యోగులకు సర్‌ప్రైజ్​​ గిఫ్ట్స్​!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>