Mobile Popup Ad
Mobile Popup Ad

త్వరలో తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుంది : నితిన్ నబీన్

కలం, వెబ్ డెస్క్ : త్వరలో తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుంది అని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణలో పర్యటించిన నితిన్ నబీన్ రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే, 9 జిల్లాల్లోని పార్టీ ఆఫీసులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. బెంగాల్ లో ఏం జరిగిందో తెలంగాణలోనూ అదే జరుగుతుందని వెల్లడించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కమలం వికసించింది అని.. త్వరలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.

దానికి ఎంతో దూరంలో లేమని.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పార్టీ నేతలకు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బూత్ లెవల్ పార్టీ అధ్యక్షులతో నితిన్ నబీన్ సమావేశం అవుతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>