Mobile Popup Ad
Mobile Popup Ad

గ్రామాల అభివృద్దే ధ్యేయం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

కలం మెదక్ బ్యూరో: అధికార, ప్రతిపక్ష భేదం లేకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధే తన ధ్యేయమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) అన్నారు. కొండాపూర్ మండలం తెర్పోల్ గ్రామంలో ఉపాధి హామీ నిధుల ద్వారా చేపట్టనున్న పలు అభివృద్ధి, నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ… ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>