కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పనుల వల్ల తెలంగాణ ఆర్టీసీ అప్పులపాలు అవుతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) అన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ఆయన స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర ఎప్పటికీ మరవలేనిదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు నెరవేరలేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి.. ఇప్పుడు వాటిని పక్కకు పెట్టిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 60వేల ఉద్యోగులతో కళకళలాడిన ఆర్టీసీ.. రానురాను 38 వేల ఉద్యోగులకు మాత్రమే పరిమితమయిందన్నారు.
ఇదే కొనసాగితే ఇంకో ఐదేళ్లలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాలలో కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ప్రోత్సాహం అందిస్తూ.. అనేక ట్యాక్స్ లు రద్దు చేసిందని చెప్పారు. కానీ, ఈవీ బస్సులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారని.. అందులో పని చేసే సిబ్బందిని కూడా ప్రైవేట్ వారిని నియమిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీ ఆర్టీసీ తీసుకుని.. ఎలక్ట్రిక్ బస్సులకు కూడా సంస్థే నడిపించాలని ఈటల డిమాండ్ చేశారు.
Read Also: పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యా, వైద్యం: పొంగులేటి
Follow Us On: Sharechat

