Mobile Popup Ad
Mobile Popup Ad

70 శాతం దాటిన పోలింగ్.. పలు చోట్ల ఉద్రిక్తత!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల (Elections) పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి బెంగాల్ లో 78.77 శాతం, తమిళనాడులో 70 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల వరకు లైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఇప్పటివరకు అత్యధికంగా బెంగాల్ లోని దక్షిణ దీనాజ్ పుర్ నియోజకవర్గంలో 81.49 శాతం, తమిళనాడులోని నమక్కల్ సెగ్మెంట్ లో 76.43 శాతం పోలింగ్‌ నమోదైంది.

బెంగాల్ లో స్వల్ప ఘర్షణలు..

పశ్చిమ బెంగాల్ (West Bengal) లో టీఎంసీ, బీజేపీ మధ్య అక్కడకక్క స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సిలిగురి జిల్లాల్లోని పలు పోలింగ్ బూత్ ల వద్ద ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకోగా.. కేంద్ర బలగాలు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టాయి. తమిళనాడులో (Tamil Nadu) పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రముఖులంతా వచ్చి ఓటు వేస్తున్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ  నెలకొంది. బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహూరీ పోరు సాగుతోంది.

Read Also: ఆడుకుంటుండగా వంట పాత్రలో ఇరుక్కున్న బాలుడు.. చివరికి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>