Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే: ఎమ్మెల్యే ధన్‌పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (Danpal Suryanarayana Gupta) విమర్శించారు. నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పేరుతో రెండేండ్లపాటు కాలయాపన చేసిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనలు ఏమయ్యాయని నిలదీశారు.

లక్ష కోట్ల అవినీతి వ్యవహారం ఏమైంది?

కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram) లక్ష కోట్ల అవినీతి జరిగిందని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడేమో 9 వేల కోట్ల అవినీతి అంటూ కొత్తరాగం ఎందుకు అందుకున్నదని ఫైర్ అయ్యారు. అవినీతి పరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నా వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని సూర్యనారాయణ గుప్తా (Danpal Suryanarayana) విమర్శించారు.

నిజామాబాద్ అర్బన్‌లో పరిస్థితి దారుణం

రాష్ట్ర ప్రభుత్వ పాలన అధ్వానంగా మారిందని ఎమ్మెల్యే విమర్శించారు. నిజామాబాద్ అర్బన్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. సిడీపీ ఫండ్ లేక పనులు ముందుకు సాగడం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇందూరుకు వచ్చిన ప్రతిసారి అభివృద్ధి అంటారు, కానీ నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాయన్నారు. అలాగే మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం దారుణమన్నారు. సమావేశంలో ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, సీనియర్ నాయకులు న్యాలం రాజు, ఇప్పకాయల కిషోర్, సత్యపాల్, పుట్ట వీరేందర్, మండల అధ్యక్షుడు పడాల భూపతి, పిల్లి శ్రీకాంత్, అమంద్ విజయ్, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read Also: సింగరేణి ఉద్యోగులకు ఎస్బీఐతో కొత్త బీమా ఒప్పందం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>