Mobile Popup Ad
Mobile Popup Ad

బండి సంజయ్ కృషితోనే ఎన్ హెచ్-563 విస్తరణ

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)  చొరవ వల్లే జగిత్యాల – కరీంనగర్ జాతీయ రహదారిని (ఎన్ హెచ్-563) 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జీర్ణించుకోలే పోతున్నారని ఫైర్ అయ్యారు. అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సుంకే రవిశంకర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని గంగాధర చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటాలకు   పాలాభిషేకం చేశారు.

కేసీఆర్, వినోద్ కుమార్ ఏం చేశారు?

గతంలో కేసీఆర్, వినోద్ కుమార్ చేయలేని పనిని బండి సంజయ్ చేసి చూపించారని పేర్కొన్నారు. బీజేపీపై ఎమ్మెల్యే సుంక రవిశంకర్ నోరు పారేసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేండ్లు  అధికారంలో ఉండి ఏం సాధించిందని ప్రశ్నించారు. బండి సంజయ్ కృషితోనే నేడు కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి సాకారం అవుతుందన్నారు.

రూ. 7 వేల కోట్లతో పనులు

ప్రధానంగా తెలంగాణలోని రెండు ప్రధాన రహదారుల విస్తరణకు (ఆర్మూర్ – జగిత్యాల – మంచిర్యాల జగిత్యాల-కరీంనగర్) కలిపి మొత్తం రూ.₹7,597.16 కోట్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఇందులో కేవలం జగిత్యాల-కరీంనగర్ సెక్షన్ కోసమే రూ.₹2,395 కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిపారు. దాదాపు 58 కిలోమీటర్ల పొడవుతో జగిత్యాల – కరీంనగర్ సెక్షన్‌ను(బీఓటీ) పద్ధతిలో విస్తరించనున్నారని తెలిపారు. ఇందులో భారీ ట్రాఫిక్ ఉండే జనాభా ప్రాంతాలను తప్పిస్తూ కొత్తగా 34.96 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లు కూడా నిర్మించనున్నారని , ఈ హైవే పై వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారనీ తెలిపారు.  ఈ కార్యక్రమంలో గంగాధర మండల బీజేపీ శాఖ అధ్యక్షుడు పంజాల ప్రశాంత్, జిల్లా కోశాధికారి వైద్య రామానుజన్, అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు కోల అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీపతి చంద్రశేఖర్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తుమ్ నారాయణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ సాదాల భాస్కర్, ప్రజా ప్రతినిధులు చంద్రారెడ్డి, గాలిపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు రేండ్ల శ్రీనివాస్, తాళ్ల రాజశేఖర్, జిల్లా నాయకులు సుద్దాల రవీందర్ రెడ్డి, వినుకొండ నరసింహారెడ్డి, పెంచాల రాములు,ఆకుల మనోహర్, దయ్యాల ప్రణయ్, హర్ష రాజు, వోడ్నాల రాజు, పరశురాముడు,చిందం ఆంజనేయులు, సుంకరి అనిల్, కట్ల శ్రీనివాస్, కొమురయ్య, శ్రీనివాస్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>