Mobile Popup Ad
Mobile Popup Ad

కాకినాడ రెవెన్యూ అధికారిపై ఏసీబీ దాడులు

కలం, వెబ్ డెస్క్ :  కాకినాడ (Kakinada)  జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB Raids) అధికారులు నిర్వహించిన సోదాలలో భారీగా అక్రమాస్తులు వెలుగుచూశాయి. జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న శివకుమార్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అదనపు ఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడతో పాటు తెలంగాణలోని నాలుగు ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలలో శివకుమార్ ఆదాయానికి మించి భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.

సోదాలలో భాగంగా కాకినాడలోని రామారావుపేటలో స్థలం, 3BHK, 4BHK లగ్జరీ ఫ్లాట్లను గుర్తించారు. అలాగే హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, ఫార్చ్యూనర్, మహీంద్రా థార్ రాక్స్, ఎలక్ట్రిక్ BE6 వంటి ఖరీదైన వాహనాలతో పాటు సుమారు 700 గ్రాముల బంగారం, నగదు, ప్రీమియం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పూర్తి విలువను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>