అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలి.. సాధన కమిటీ

కలం, ఖానాపూర్ : ఖానాపూర్ (Khanapur) పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అనర్హులను వెంటనే తొలగించి అర్హులకు ఇళ్లు కేటాయించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐయూ, బీసీపీ, డబుల్ బెడ్రూం సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కొమురం భీం చౌరస్తాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని, అనర్హులకు ఇళ్లు కట్టబెట్టారని వారు ఆరోపించారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. అనేక పోరాటాల అనంతరం అధికారులు కొంతమంది అనర్హుల జాబితాను ప్రకటించినప్పటికీ, కేటాయింపులపై పూర్తిస్థాయిలో విచారణ జరపడం లేదని వారు మండిపడ్డారు. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా పేదల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, అనర్హులను తొలగించి నిజమైన అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>