కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై బీజేపీ (BJP) పోరుబాట పట్టింది. ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో నేడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) లో బీజేపీ బస్సు యాత్ర చేపట్టనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు 8 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు , 3 ఎమ్మెల్సీలతో కూడిన బృందం రైతు గోస బీజేపీ భరోసా పేరుతో సోమవారం సాయంత్రం 4 గంటలకు గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించనున్నారు.

