బీహార్(Bihar)లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్నది. నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం స్పీకర్ పదవికి బీజేపీ(BJP), జేడీయూ(JDU) మధ్య పోటాపోటీ నెలకొన్నదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి జేడీయూకు ఇచ్చాము కాబట్టి స్పీకర్ తమకే కావాలని బీజేపీ పట్టుబడుతున్నది. సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఎంతో కీలకం. ఈ పదవిని బీజేపీకి ఇచ్చేందుకు జేడీయూ సుముఖంగా లేనట్టు సమాచారం. దీంతో పోటీ తీవ్రంగా మారింది. మంగళవారం (నేడు) కూటమి నేతల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్పీకర్ పదవి, ముఖ్యమంత్రి, ఇతర ముఖ్యమంత్రి సలహాదారులు, క్యాబినెట్ మంత్రుల కేటాయింపుపై చర్చలు జరగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
స్పీకర్ పదవిపై బీజేపీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గత అసెంబ్లీలో బీజేపీకి చెందిన నంద్‌కిశోర్(Nand Kishore) యాదవ్ స్పీకర్‌గా ఉన్నారు. జేడీయూ పార్టీకి చెందిన నరేంద్ర నారాయణ్ యాదవ్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మరోసారి భాజపా స్పీకర్ పదవిని దక్కించుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
నేటి సమావేశంలో బీజేపీ నేతలు పట్నాలో కీలక చర్చలు నిర్వహించారు. జేడీయూ నేతలు సంజయ్ కుమార్ ఝా, లాలన్‌సింగ్ సహా మరికొందరు నాయకులు ఈరోజు జరిగే ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 19న, బీజేపీ, జేడీయూ వేర్వేరు శాసనసభ పక్ష సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ తర్వాత ఒక ఉమ్మడి సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సీఎం నితీశ్‌కుమార్(Nitish Kumar) అసెంబ్లీని రద్దు చేసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలిసినట్లు సమాచారం. బుధవారం మరోసారి గవర్నర్‌ను కలసి సీఎం పదవికి రాజీనామా సమర్పిస్తారు.
ఎన్డీయే ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించిన తర్వాత, గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. అనంతరం నితీశ్‌కుమార్‌తో పాటు ఇతర క్యాబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుంది. ఇటీవలి బీహార్(Bihar) అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 సీట్లు గెలుచుకుంది.
Read Also: ఢిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం
Follow Us on: Youtube

