కలం, వెబ్ డెస్క్ : బీజేపీలో ఆప్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయనున్నట్లు రాఘవ్ చడ్డా ప్రకటించడంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. బీజేపీ పంజాబ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. రాఘవ్ చడ్డాతో పాటు పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హర్భజన్ సింగ్ వంటి నేతలు బీజేపీలోకి వెళ్లడం కేవలం పార్టీకి కలిగిన నష్టం కాదని అన్నారు. ఈ నిర్ణయం పంజాబ్ ప్రజల తీర్పును అవమానించడమేనని అభివర్ణించారు. భారీ ప్రలోభాలతోనే ఆయా ఎంపీలను బీజేపీ చేర్చుకుందని ఫైర్ అయ్యారు. నాయకులు వెళ్లవచ్చు.. కానీ ఆప్ సిద్ధాంతం , ప్రజల మద్దతు ఎప్పటికీ చెక్కు చెదరవని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు దారులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కాగా, రాజ్యసభలో మొత్తం 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉండగా.. తన నేతృత్వంలోని ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు రాఘవ్ చడ్డా ప్రకటించారు. ఇందులో రాఘవ్ చడ్డాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, విక్రమ్ జిత్ సింగ్ సాహ్నీ ,రాజిందర్ గుప్తా పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీకి చెందిన స్వాతి మాలివాల్ కూడా ఆప్ ను వీడారు. దీంతో రాఘవ్ చడ్డాకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్యసభలో ఆప్ కు ఉన్న మెజారిటీ ఎంపీలు బీజేపీలో విలీనం కావడంతో వారిపై అనర్హత వేటు అవకాశం లేకుండా పోయింది.
Read Also: తెలంగాణలో డిజిటల్ విప్లవం.. స్కూల్ రిపోర్ట్ కార్డుల పంపిణీలో మీ సేవ రికార్డ్
Follow Us On : WhatsApp

