Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్‌లో ఫియర్‌లెస్ బౌలర్.. 72 బాల్స్, నో సిక్స్!

కలం, వెబ్​ డెస్క్​: ఐపీఎల్ (IPL) 2026 సీజన్ సగం ముగిసే సమయానికి భారత క్రికెట్‌లోని సరికొత్త ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ప్రధానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున అరంగేట్రం చేసిన యువ బౌలర్ సాకిబ్ హుస్సేన్ (Sakib Hussain) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు సాకిబ్. తన మొదటి మ్యాచ్‌లోనే 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. యశస్వి జైస్వాల్ లాంటి అగ్రశ్రేణి బ్యాటర్లను ఔట్ చేసి లీగ్‌లో తనదైన ముద్ర వేశాడు.

సాకిబ్ హుస్సేన్ (Sakib Hussain) ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మొత్తం 72 బంతులు వేయగా, ఒక్క బ్యాటర్ కూడా అతని బౌలింగ్‌లో సిక్సర్ కొట్టలేకపోవడం విశేషం. సిక్సర్ల వర్షం కురిసే టీ20 క్రికెట్‌లో ఇది ఒక అసాధారణమైన రికార్డ్. బీహార్‌లోని ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన సాకిబ్ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన సన్‌రైజర్స్ యాజమాన్యం అవకాశం కల్పించింది. అతను అవకాశాన్ని అందిపుచ్చుకుని నిలకడైన ప్రదర్శనతో ఐపీఎల్ 2026లో అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా ఎదుగుతున్నాడు.

Read Also: ‘ RBI కీలక నిర్ణయం.. పేటీఎమ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>