రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన బీజేపీ

కలం, వెబ్ డెస్క్: తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను తెలంగాణ బీజేపీ (BJP) ప్రకటించింది. ఈ బీజేపీ 116 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులను మేరకు నియమించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులను సైతం ప్రకటించింది. శాశ్వత ఆహ్వానితుల్లో బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మొత్తం 199 మంది ఈ కార్యవర్గంలో ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ శాశ్వత ఆహ్వానితులుగా మొత్తం 20 మంది కొనసాగనున్నారు. రాష్ట్ర కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ కేంద్ర మంత్రులు, గవర్నర్‌లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌లు, సినీనటులు పసునూరి శ్రీనివాస్‌, డి. కవిత, లక్ష్మీకాంతరావు, జీవిత రాజశేఖర్‌, శివకృష్ణ మొత్తం 62 మంది ఉంటారు. తాజాగా మరో 116 మంది సీనియర్‌ నాయకులను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రాంచందర్‌రావు (NRamchander Rao) ప్రకటించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>