నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం.. జెండా ఎగరవేయనున్న రామ్ చందర్‌రావు

కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం (BJP foundation day) సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో వేడుకలు జరుగనున్నాయి. 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్‌రావు (Ramchander Rao) పార్టీ జెండా ఎగరవేయనున్నారు. రామచందర్‌రావు సమక్షంలో పలువురు టీవీ ఆర్టిస్టులు బీజేపీలో చేరనున్నారు. అయితే ఇప్పటికే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు పార్టీ నిర్దేశించిన వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని చెప్పారు. ఇంటి యజమాని అనుమతితో వారి ఇంటిపై పార్టీ జెండా ఎగుర వేయాలని ఆయన సూచించారు.

దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకోనున్నారని ఆయన చెప్పారు. వేడుకలకు ముందు రోజే ప్రతి బూత్‌లో, ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు ఇప్పటికే పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పారు. బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని జాతీయ సేవ, జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అని పేర్కొన్నారు. గతంలో జనసంఘ్‌గా ప్రారంభమైన ఈ ప్రయాణం, 1980లో ముంబైలో అటల్ బిహారీ వాజపేయి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుందని గుర్తుచేశారు. సిద్ధాంత బలం, క్రమశిక్షణ గల కార్యకర్తల శ్రమ, జాతీయ సేవ పట్ల నిబద్ధతతో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>