ఎండలు, వానలు.. భిన్న వాతావరణంపై విపత్తులశాఖ అలర్ట్​

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ లో విభిన్న వాతావరణం ఉంది. ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల శాఖ పేర్కొంది. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం పడే ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్​ (Weather Alert ) చేసింది. బంగాళ ఖాతం మీదుగా ఉపరిత ఆవర్తనం కొనసాగుతుండగా రాయసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ఆవర్తనాల ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన చేసింది. అలాగే దక్షిణాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ఈ పరిస్థితుల్లో పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం (Weather Alert) చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారమరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్​ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>