కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లో బీజేపీ ఘన విజయంపై పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో సైతం బీజేపీ (BJP) కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో ఆసక్తిక ఫ్లెక్సీలు ప్రదర్శించారు. త్రిమూర్తులు బెంగాల్ రాజకీయ చరిత్రను తిరగరాశారని పేర్కొంటూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలతో నినాదాలు చేశారు. అలాగే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee), సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చిత్రాలు ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు. మమతా బెనర్జీ బాటలోనే సీఎం రేవంత్ నడుస్తున్నారని అందులో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని పేర్కొన్నారు. బెంగాల్‌లో మమతా పరిపాలనను, టీఎంసీ ఓటమిని సీఎం రేవంత్ పరిపాలనతో పోలుస్తూ ప్రదర్శించిన ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్ విజయంతో ఉత్సాహంతో ఉన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణలో సైతం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

