కలం, భువనగిరి : రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మొదటి నుంచే మోసం చేస్తోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ (Bikshamaiah Goud) ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు (Aleru) పట్టణంలోని దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భిక్షమయ్య గౌడ్ మాట్లాడారు. బీసీల అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. సంవత్సరానికి రూ.20 వేల కోట్లు ఇస్తామని, బీసీలకు 40 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించినప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు.
ఈ రిజర్వేషన్ అమలు అయితే విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి జాతీయ స్థాయిలో కూడా ప్రతిపాదన తీసుకెళ్తామని హామీ ఇచ్చినా ఆచరణలోకి రాలేదన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పినా.. స్థానిక సంస్థల ఎన్నికలను ఆ హామీ లేకుండానే నిర్వహించారని విమర్శించారు.
Read Also: ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!
Follow Us On: X(Twitter)

