Mobile Popup Ad
Mobile Popup Ad

కాశీయాత్రలో విషాదం.. ఏపీ వాసులు మృతి!

కలం, వెబ్ డెస్క్ : బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Bihar Road Accident) జరిగింది. కాశీయాత్రకు వెళ్లిన నెల్లూరు జిల్లా భక్తుల బస్సును ఓ లారీ బలంగా ఢీకొట్టింది. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 1వ తేదీన నెల్లూరు జిల్లా నుంచి ఒక ప్రైవేటు బస్సులో భక్తులు కాశీయాత్రకు బయలుదేరారు. అంతా ప్రశాంతంగా సాగిపోతుందనుకున్న తరుణంలో, బీహార్ పరిధిలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ వీరి బస్సును ఢీకొట్టింది. చీకట్లో జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర కలకలం రేగింది. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు సంగం ప్రాంతానికి చెందినవారు కాగా, మరొకరు ఆత్మకూరుకు చెందిన మహిళగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం బాధితులకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. స్వగ్రామాల్లోని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి..

బీహార్‌ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికులు మరణించడం పట్ల రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమాచారం అందిన వెంటనే స్పందించిన మంత్రి, బీహార్‌ లోని ఉన్నతాధికారులతో అత్యవసరంగా సంప్రదింపులు జరిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను త్వరితగతిన అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>