కలం, వెబ్ డెస్క్ : బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓ ముస్లిం యువతి హిజాబ్ (Hijab) లాగిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులకు నితీశ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో ముస్లిం మహిళకు పత్రం అందజేస్తూ మొదట మహిళను హిజాబ్ తీయాలని కోరారు. ఆ తరువాత ఒక్కసారి ఆమె ముఖంపై నుంచి ముసుగు లాగేశారు. దీంతో యువతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్జేడీ (RJD) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మహిళ హిజాబ్ లాగండంతో సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) పై కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ చర్య మహిళలను అవమానపర్చేలా ఉందని, వెంటనే నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, నితీశ్ మానసిక పరిస్థితిపై ఆర్జేడీ అనుమానం వ్యక్తం చేసింది. కాగా, మహిళ హిజాబ్ లాగడంతో వేదికపై ఉన్న నాయకులు, అధికారులు నవ్వారు. దీంతో మహిళ అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో కనిపించింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు ఇలా చేయడం తప్పు అని చెబుతుండగా, కొంతమంది సీఎం నితీశ్ కుమార్ కు సపోర్ట్ చేస్తున్నారు.
Read Also: స్టూడెంట్లకు కంప్యూటర్లు ఇచ్చిన పవన్ కల్యాణ్..
Follow Us On: Sharechat


