వెయ్యితో మొదలై కోట్ల స్కాలర్‌షిప్‌ దాకా.. బిహార్‌ కుర్రాడు సంచలనం

కలం, వెబ్ డెస్క్: బిహార్‌లోని (Bihar) చంపారన్‌కు చెందిన 19 ఏళ్ల ఆదర్శ్ కుమార్ తన 14వ ఏట పాత ల్యాప్‌టాప్‌, రూ.1,000తో ఇంటి నుంచి బయలుదేరి భవిష్యత్తు కోసం పోరాటం ప్రారంభించాడు. కోటాలో కోచింగ్‌కు డబ్బులు లేకపోయినా వెనుకడుగు వేయకుండా స్టార్టప్‌లు, సామాజిక కార్యక్రమాలపై పనిచేసి ‘స్కిల్‌జో’ అనే విద్యా వేదికను నిర్మించాడు. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా దాదాపు 20 వేల మంది విద్యార్థులకు నైపుణ్యాలు, మెంటార్‌షిప్‌, అవకాశాలు అందాయి. 2025లో గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్‌ను గెలుచుకుని రూ.100,000 బహుమతిని సొంతం చేసుకున్నాడు.

తాజాగా 22 యూనివర్సిటీల నుంచి తిరస్కరణలు ఎదుర్కొన్న ఆదర్శ్‌కు ఖతార్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పూర్తి స్థాయి స్కాలర్‌షిప్‌ లభించింది. సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఈ స్కాలర్‌షిప్‌లో ట్యూషన్ ఫీజు, వసతి, భోజనం, విమాన ప్రయాణం, వీసా, ఆరోగ్య బీమా తదితర ఖర్చులు ఉంటాయి. దోహాలోని ఎడ్యుకేషన్ సిటీలో 70కుపైగా దేశాల విద్యార్థులతో కలిసి చదవనున్న ఆదర్శ్‌ ప్రయాణం, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి అవకాశాలను సృష్టించుకున్న యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>