గాంధీభవన్‌లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ నేతల కీలక భేటీ

కలం, వెబ్ డెస్క్ : గాంధీభవన్‌లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ (Nagarkurnool Congress) నేతల కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ , వంశీచంద్ రెడ్డితో పాటు జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాజీవ్ రెడ్డి , కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్ అంశంపై నేతలతో సచిన్ సావత్ చర్చించారు. ఓట్లు కోల్పోకుండా నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>