మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ డ్రైవర్ అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ఎదుట సదరు డ్రైవర్‌ను పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించడమే కాకుండా, ఆయనపై ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటనలో సుమంత్‌తో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు నమోదైంది.

బాధితుడి ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగానే పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి సుమంత్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సుమంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>