Mobile Popup Ad
Mobile Popup Ad

రాముడు బీజేపీ దేవుడు కాదు.. అందరివాడు : గణేష్ బిగాల

కలం, నిజామాబాద్ బ్యూరో : రాముడు అందరివాడు అనే విషయాన్ని బిజెపి, కాంగ్రెస్ పార్టీల వాళ్లు తెలుసుకోవాలని నిజామాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Bigala Ganesh) వ్యాఖ్యానించారు. నిజామాబాద్ 36, 37, 38, 43 డివిజన్ ల కార్నర్ మీటింగ్ లలో గణేష్ గుప్తా ప్రసంగించారు. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దపు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు. కాంగ్రెస్​ హామీలైన మహిళలకు స్కూటీలు, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం, గ్యాస్ సబ్సిడీ రాలేదని ఆయన గుర్తు చేశారు.

నిజామాబాద్ (Nizamabad) నగరంలో మార్కండేయ గుడి, హమాల్ వాడి సాయిబాబా, నాగారంలో పెద్దమ్మ గుడి ఆలయాలను కట్టించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేన్నారు. అభివృద్ధిలో కూడా నిజామాబాద్ ను 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పనులు చేసి ముందుకు తీసుకెళ్లమన్నారు. మళ్లీ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డివిజన్లలలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. మోడ్రన్ స్మశాన వాటికలు, మినీ ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, నూతన కలెక్టరేట్, మున్సిపల్ భవనాన్ని నిర్మించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు గణేష్ గుప్తా (Bigala Ganesh).

కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఎక్కడుందో చూపించాలన్నారు. నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఇప్పటివరకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు.. ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. ఎలక్షన్ల కోసం ఊరు పేరు మార్చాలని బిజెపి ప్రభుత్వం రచ్చ చేస్తుందని.. ఊరు పేరు మారితే కడుపులు నిండుతాయా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ అభ్యర్థి దువ్వ వనజ వెంకట్, 37వ డివిజన్ అభ్యర్థి ప్యాట విజయలక్ష్మి, 38 వ డివిజన్ అభ్యర్థి ఎం రాజేష్, 43వ డివిజన్ అభ్యర్థి వెంకటరమణ (బుజ్జి), బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: వరంగల్ మున్సి‘పోల్స్‘లో చిత్రవిచిత్రాలు.. ఓట్ల కోసం నేతల ఫీట్లు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>