కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామం (Pocharam Village) లో అక్రమంగా కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంపై మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ కేంద్రంలో తయారు చేస్తున్న కల్తీ పాలను హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోచారం గ్రామానికి చెందిన అండే శ్రీశైలం (43) పాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడిని కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతని ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించగా కల్తీ పాల తయారీ వ్యవహారం బయటపడింది.

ఈ దాడుల్లో 100 లీటర్ల కల్తీ పాలు, ఒక లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒక్కో కిలో బరువున్న 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అండే శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో ఈ కేంద్రంలో తయారైన కల్తీ పాలను హైదరాబాద్‌లో విక్రయించేందుకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>