కలం, వెబ్ డెస్క్: రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్‌లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో భట్టి ప్రసంగించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలంటే రాజ్యాంగ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.
భారత రాజ్యాంగం కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాదు.. ప్రతి పౌరుడి హక్కులకు భరోసానిస్తుంది అని భట్టి (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయానికి రాజ్యాంగమే పునాది అని భట్టి స్పష్టం చేశారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఆ రోజు అత్యంత విశిష్టమైనదని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు.

