నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం వార్నింగ్.. ఎందుకంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) కు కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో పాకిస్తాన్‌కు సంబంధించిన కంటెంట్ ప్ర‌సారం చేయ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాక్‌కు సంబంధించిన కంటెంట్ ప్ర‌సారం చేయ‌వ‌ద్ద‌ని గ‌తంలోనే కేంద్ర ప్ర‌భుత్వం నెట్‌ఫ్లిక్స్‌కు సూచించింది. ఈ మేర‌కు 2025 మేలో స‌మాచార‌, ప్ర‌సారార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ నటులు ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్, హనియా ఆమిర్ నటించిన జో బచాయే హై సంగ్ సమేట్‌ వెబ్ సిరీస్ విడుదలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.

నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన తొలి పాకిస్తానీ ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా ఈ ప్రోగ్రామ్‌ గుర్తింపు పొందింది. డిసెంబర్ 4న ఇది విడుదల కానుంది. అయితే భారత్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంటుందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. 2025 మేలో భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాక్‌కు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు తదితర కంటెంట్‌ను భారత ఓటీటీ వేదికల నుంచి తొలగించాలని కేంద్రం ఆదేశించింది.

2025 మేలో జారీ చేసిన ఆదేశాలతో జూన్ లో భారతీయ వినియోగదారులకు పాకిస్తానీ కంటెంట్ అందుబాటులో లేదని నెట్‌ఫ్లిక్స్ (Netflix) హామీ ఇచ్చింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల కావడంతో పలు సంస్థలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశాయి. ఈ సిరీస్‌ను భారత్‌లో నిషేధించాలని, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కేటలాగ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. మరోవైపు పాక్‌ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ఈ డిమాండ్లపై విమర్శలు చేశారు. క్రీడలు, నీళ్లు, కళలు, సంస్కృతిని కూడా రాజకీయ అంశాలుగా మార్చడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కేంద్రం తాజా హెచ్చరికపై నెట్‌ఫ్లిక్స్ స్పందించ లేదు.

Also Read : మ‌ద్దిమ‌డుగు హ‌నుమాన్ ఆల‌యంలో సీఎం పూజ‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>