వరి కోతల్లో ప్రత్యక్షమైన 15 అడుగుల కొండచిలువ.. రైతుల చేతిలో హతం

కలం, నిర్మల్ రూరల్ : నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో భారీ కొండచిలువ (Giant Python) ప్రత్యక్షమై రైతులను, గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. గురువారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన రైతు సాయేందర్ తన వ్యవసాయ పొలంలో వరి కోతలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ కొండచిలువ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన రైతు అక్కడి నుంచి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు పొలం వద్దకు చేరుకున్నారు. సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువను చూసి ఆందోళనకు గురైన కొందరు గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో అది మృతి చెందింది. పంట పొలంలో భారీ కొండచిలువ కనిపించడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>