Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ కార్మికులకు థ్యాంక్స్ చెప్పిన భట్టి

కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిపీల్చుకున్నది. మంత్రుల కమిటీతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. కీలక డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమణకు ఒప్పుకున్నది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)  కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ ఒక పెద్ద కుటుంబమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా పాలన ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకున్నదన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఇవే..

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం వెంటనే ఏర్పాట్లు చేయాలని యాజమాన్యానికి ఆదేశించింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న విలీనం అంశంపై అధికారులు, కార్మిక నాయకులతో అధికారిక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరవించారు.

Read Also: ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం: కవిత కీలక హామీలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>