కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో (Dwaraka Tirumala) డ్రెస్ కోడ్ నిబంధన ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ నిబంధనల ప్రకారం పంజాబీ డ్రెస్ ధరించిన మహిళలు తప్పనిసరిగా చున్నీ (Dupatta) వేసుకోవాలని ఓ మహిళా సెక్యూరిటీ గార్డు సూచించడమే ఈ వివాదానికి కారణమైంది. ఈ క్రమంలో భక్తురాలు ‘నేను అసభ్యకరంగా ఉన్నానా?’ అంటూ సెక్యూరిటీ గార్డుతో తీవ్ర వాగ్వివాదానికి దిగింది. మాట మాట పెరగడంతో ఆగ్రహానికి గురైన యువతి, ఆమె కుటుంబ సభ్యులు మహిళా గార్డుపై దాడికి దిగారు. భక్తుల ముందే ఈ గొడవ జరగడంతో ఆలయ ప్రాంగణంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు భద్రతా సిబ్బంది, ఇతర భక్తులు జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో గొడవకు ఫుల్స్టాప్ పడింది.
Read Also: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం : అచ్చెన్నాయుడు
Follow Us On: Instagram

