ఏఐతో పెరిగిన మైనింగ్, రవాణా శాఖల ఆదాయం: భట్టి

కలం, వెబ్ డెస్క్: ఆధునిక ఏఐ టెక్నాలజీని వినియోగించడంతో వివిధ శాఖల్లో పన్నుల వసూళ్లపై నిరంతర సమీక్షలు, పకడ్బందీ నిర్వహణతో రాష్ట్ర ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం రెవిన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబిలైజేషన్‌పై భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మెట్రో రైల్ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ-వ్యయ మార్గాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ మీటింగ్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖల్లో ఆదాయ వనరులను సమర్థవంతంగా పెంచుకోగలిగామన్నారు. ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వంటి అక్రమాలను అడ్డుకోవడానికి అధికారులు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కమర్షియల్ టాక్స్ శాఖలో GST ఆదాయం గత 3 నెలలుగా 15% పెరుగుదల నమోదైందని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని చెప్పారు.

2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధన లక్ష్యంగా అన్ని శాఖలు ఆదాయ సమీకరణకు స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను భట్టి ఆదేశించారు. ప్రతి శుక్రవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహించి, ఆదాయ వనరుల పెంపునకు సమీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. హెచ్ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) సూచించారు. దీని ద్వారా ఆదాయ వనరులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భూముల విలువ పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీలు అధ్యయనం పూర్తి చేశాయని భట్టి వివరించారు. వాటి నివేదికలను ముందుగా సబ్ కమిటీకి, ఆ తర్వాత కేబినెట్‌కు సమర్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Read Also: రూ.8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు?: జూపల్లి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>