epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మధిరకు వరద నుంచి విముక్తి: భట్టి విక్రమార్క

కలం, వెబ్‌ డెస్క్‌: మధిర (Madhira) పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక నిర్ణయం తీసుకున్నారు. మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో పట్టణాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. అధికారులతో కలిసి మధిరలోని భౌగోళిక పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం, వరద నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
వైరా నది(Wyra River) ఉధృతి కారణంగా మధిర పట్టణం ఎదుర్కొంటున్న వరద ముప్పును అరికట్టేందుకు శాస్త్రీయ పద్ధతిలో అడుగులు వేస్తున్నట్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రిటైనింగ్ వాల్, కొత్త బ్రిడ్జి నిర్మాణాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల కోసం టెక్నికల్ సర్వే ఆధారంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.
మధిర ప్రజల చిరకాల వాంఛ అయిన వరద విముక్తి కోసం అత్యాధునిక సాంకేతికతను జోడించి పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పట్టణ సుందరీకరణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని, త్వరలోనే మధిర రూపురేఖలు మారిపోతాయని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>