కలం, వెబ్ డెస్క్ : ఓలా, ఉబర్ ట్యాక్సీలకు ప్రత్యామ్యాయంగా త్వరలోనే భారత్ ట్యాక్సీ (Bharat Taxi) సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, డ్రైవర్లకు ఆర్థిక లాభాలు అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అని ఆయన చెప్పారు.
బుధవారం హరియాణాలో జరిగిన సహకారి సమ్మేళనంలో అమిత్ షా పాల్గొని ప్రసగించారు. సమ్మేళన్‌లో పాల్గొన్న అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న భారత్ ట్యాక్సీ సేవల్లో వచ్చే లాభాలను పూర్తిగా డ్రైవర్లకే పంచే విధంగా రూపొందించినట్లు వెల్లడించారు.
దీని ద్వారా డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా, ప్రయాణికులకు నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన సేవలు అందుతాయని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం యాప్ యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో Bharat Taxi యాప్ సేవలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి.


