బస్టాండ్ల దుస్థితిపై ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం..

కలం, ఖమ్మం బ్యూరో: మహిళలకు మహాలక్ష్మి పథకం (Mahalaxmi scheme) ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతోందని కొత్తగూడెం (Bhadradri Kothagudem) ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) తెలిపారు. అయితే జిల్లాలోని బస్టాండ్ల పరిస్థితి దారుణంగా ఉందని, వాటిని తక్షణమే బాగు చేయకపోతే నిరహార దీక్ష చేపట్టడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ.10 వేల కోట్లు ఆదా అయిన సందర్భంగా కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Kunamneni) మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ల అభివృద్ధికి రూ.18 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ మంత్రిని పలుమార్లు కోరినా నిధులు విడుదల కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కొరత కారణంగా బస్టాండ్ల పైకప్పులు కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల జీతాలను పెంచాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని ప్రతి డిపోకు రూ.5 కోట్లు కేటాయిస్తే మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.2600 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఉచిత బస్సు ప్రయాణాన్ని సమర్థంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ఐదుగురు మహిళలను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: భూభారతి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>