క్రీడాకారులు నైపుణ్యాలతో లక్ష్యాలను చేరుకోవాలి: కలెక్టర్

కలం, జోగులాంబ గద్వాల : క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు క్రీడాకారులు నైపుణ్యాలను పెంపొందించుకొని అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Gadwal Collector) అన్నారు. శనివారం గద్వాల మండలం వీరాపూర్ గ్రామంలోని ఎస్ఆర్ విద్యానికేతన్ లో జూలై 29న ప్రారంభమైన సీబీఎస్ఈ సౌత్ క్లస్టర్ (7వ) బాలుర వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నమెంటులో పెద్ద ఎత్తున పాల్గొన్నప్పటికీ నిర్వాహకులు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడం గర్వకారణమన్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది సమన్వయంతో పనిచేసి క్రీడలను విజయవంతం చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి, విజేతలకు జిల్లా కలెక్టర్ (Gadwal Collector) శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ విభాగాల వారీగా విజేతలు, రన్నర్స్ కు కలెక్టర్ పతకాలు, ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీబీఎస్ఈ పాఠశాలల పరిశీలకులు శేషు, డైరెక్టర్ రాముడు, ప్రిన్సిపల్ గోన సునీత, ఇతర ఉపాధ్యాయులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : హేట్ స్పీచ్ బిల్లుపై ఎమ్మెల్యే కూనంనేని కీలక సూచనలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>