Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి రామయ్యకు భారీగా హుండీ ఆదాయం

కలం, ఖమ్మం బ్యూరో:  శ్రీరామనవమి నేపథ్యంలో భద్రాద్రి (Bhadrachalam) రామాలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది.  గడిచిన 36 రోజుల్లో అక్షరాల 1.56 కోట్ల రూపాయలు స్వామివారి హుండీలో భక్తులు సమర్పించారు. గత నెల ఆదాయం సుమారు 1.06 కోట్లు కాగా ఈ సారి శ్రీ రామనవమి నేపథ్యంలో రూ. 50 లక్షలు అదనంగా రావడం గమనార్హం. దీంతోపాటు 71 మిల్లీగ్రాముల బంగారం, 1.280 కిలోల వెండితోపాటు యుఎస్ డాలర్స్(34), కెనడా డాలర్(1), మలేషియా రింగేట్స్ (196), యూఏఈ దుర్హమ్స్(100), సింగపూర్ డాలర్(27), ఇంగ్లాండ్ యూరో(80), సౌదీ అరేబియా డాలర్స్(50), ఆస్ట్రేలియా డాలర్(50) వంటి విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించారు. ఆలయ ఈ ఓ దామోదర్ రావు సమక్షంలో, పటిష్టమైన పోలీస్ బంధోబస్తు నడుమ, సీ సీ కెమరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ జరిగిందని అధికారులు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>