Mobile Popup Ad
Mobile Popup Ad

లారీని ఢీకొన్న భద్రాచలం బస్సు.. 25 మందికి గాయాలు!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వైరా వద్ద లారీని ఢీ కొట్టింది. ఇనుప స్టూళ్లను తీసుకెళ్తున్న రిక్షా నుంచి స్టూలు కింద పడడంతో వెనుక నుంచి వస్తున్న కారు డ్రైవర్​ సడెన్​ బ్రేక్​ వేశాడు. దీంతో కారు వెనుక వస్తున్న లారీ ఆగడంతో దాని వెనకే వస్తున్న బస్సు లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. బస్ లో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా దాదాపు 25 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసిన స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ గురువారం కొత్తగూడెంలో, శనివారం వైరా లో ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>