కలం, వెబ్ డెస్క్: ఒకప్పుడు గోవా యువత కలల గమ్యస్థానం. స్నేహితులు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడల్లా ముందుగా గుర్తుచ్చేది గోవానే. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడ వీకెండ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. నైట్ క్లబ్‌లో 25 మంది చనిపోవడమే అందుకు కారణం. సోషల్ మీడియాలో చర్చ ప్రతిరోజూ గోవా గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఒకప్పుడు మహిళలకు, విదేశీ పర్యాటకులకు సురక్షితమైన ప్రదేశంగా పేరుంది. కానీ తరచుగా జరుగుతున్న ఘటన గోవాలో భద్రతపై అనేక సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, వీకెండ్ పార్టీలు కోసం యువత, టూరిస్టులు ఇతర డెస్టినేషన్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. అవి ఏమిటంటే..
పూరి, ఒడిశా: ఒడిశాలో నిజానికి కొన్ని అద్భుతమైన బీచ్‌లున్నాయి. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌కు ఈ బీచ్ గమ్యస్థానం. ఇక్కడ స్థానిక వంటలు, ప్రత్యేకమైన బీచ్‌లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
రాధానగర్ బీచ్, అండమాన్, నికోబార్ దీవులు: హావ్‌లాక్ దీవుల్లో భాగమైన ఈ బీచ్ చాలా అందంగా ఉంది. ఇండియాలోనే అత్యుత్తమ బీచ్‌లలో ఇదొకటి. ప్రశాంతమైన వాతావరణమే కాదు.. ఇక్కడ ఆకట్టుకునే ప్రదేశాలున్నాయి. సూర్యాస్తమయం అద్భుతంగా ఉండటం ఈ బీచ్ ప్రత్యేకత. అందుకే చాలా కపుల్స్ విడిది కోసం ఇక్కడ వస్తుంటారు.
గోకర్ణ, కర్ణాటక: గోకర్ణ నగరంలో బీచ్ ఎంతోమంది పర్యాటలకు ఆకర్షి్స్తోంది. సర్ఫింగ్, వాటర్ గేమ్స్, ఇతర సరదా యాక్టివిటీస్ చేసుకోవచ్చు. గోవాకు బదులు ఈ ప్లేస్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
వర్కల, కేరళ: కేరళ అనేక బీచ్‌లున్నాయి. కానీ వర్కల ప్రత్యేకమైనది. పెద్ద కొండ శిఖరం ఉన్న ఈ అద్భుతమైన బీచ్ టూరిస్టులను మంత్రముగ్ధులను చేస్తుంది. బీచ్‌సైడ్ కేఫ్‌లో కూర్చుని అక్కడి అందాలను మొత్తం తిలకించవచ్చు.
మందర్మణి, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఈ బీచ్ పర్యాటకుల స్వర్గధామం. మందర్మణి అనేక అందమైన అద్భుతాలకు నిలయం. ఇక్కడ ఎర్రటి పీతలను చూడొచ్చు. అలాగే బెంగాలీ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.
Read Also: 9-5 IT జాబ్.. ఆమె కల నెరవేర్చింది
Follow Us On : X(Twitter)


