epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అవతార్ 3 అంచనాలను అందుకుంటుందా!

కలం, వెబ్ డెస్క్: అవతార్ 3 (Avatar 3) అంచనాలను అందుకుంటుందా? రేసులో ఉన్న టాలీవుడ్ సినిమాలను బాక్సాఫీస్ వద్ద గట్టిగ ఢీకొడుతుందా? సినిమా అభిమానుల్లో ఇప్పుడు ఇదే చర్చ. ఎందుకంటే అవతార్ 3 కి ఊహించినంత హైప్ రావట్లేదు. 2009లో విడుదలైన అవతార్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఘనవిజయంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఫ్రాంచైజీలో మరో నాలుగు సీక్వెల్ సినిమాలను ప్లాన్ చేశాడు. కానీ మొదటి సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. విడుదలకు ముందు వచ్చిన భారీ హైప్ కారణంగా మాత్రమే బాగానే వసూళ్లు సాధించింది.

కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఈ ప్రభావం ‘అవతార్ 3’పైనా పడింది. మొదటి రెండు భాగాలతో పోలిస్తే మూడో భాగానికి బజ్ చాలా తక్కువగా ఉంది. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నప్పటికీ ఇప్పటివరకు పెద్దగా హైప్ కనిపించడం లేదు.

భారత్‌లో డిసెంబర్ 19న ‘అవతార్ 3 (Avatar 3)’ విడుదల కానుంది. అదే సమయంలో అఖండ 2 వంటి భారీ సినిమాలు కూడా రేసులో ఉండే అవకాశం ఉంది. అవతార్ 3కి ప్రస్తుతం పెద్దగా బజ్ లేకపోయినా, పాజిటివ్ టాక్ వస్తే ఇతర చిత్రాలను వెనక్కి నెట్టే శక్తి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మునుపటి భాగాల్లా ఈ సినిమా ప్రభావం చూపుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Read Also: 9-5 IT జాబ్.. ఆమె కల నెరవేర్చింది

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>