Mobile Popup Ad
Mobile Popup Ad

స్నేహితురాలితో గొడవ.. పెట్రోల్​ బాంబు పేల్చుకుని యువకుడి సూసైడ్​

కలం, వెబ్​ డెస్క్​ : స్నేహితురాలితో గొడవ కారణంగా ఓ యువకుడి పెట్రోల్​ బాంబు పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన నాగేంద్ర (30) అనే వ్యక్తి తన స్నేహితురాలు రమ్యతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాదన జరగడంతో నాగేంద్ర తమకూరు జిల్లా సీరా సమీపంలోని జాతీయ రహదారి వద్దకు రాగానే పెట్రోల్​ బాంబుతో ఆత్మహుతికి పాల్పడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో భారీగా మంటలు చెలరేగడంతో హైవేపై పెద్ద ఎత్తున పొగ అలుముకుంది.

సంఘటపై సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, రమ్య తన ప్రేమను అంగీకరించకపోవడం వల్లే నాగేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also: చేస్తే చాల‌దు.. చెప్పాలి.. ప్ర‌చారంపై సీఎం ఫోక‌స్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>