పవర్‌ఫుల్ యాక్షన్‌తో ‘టైసన్ నాయుడు’.. టీజర్ రిలీజ్

కలం, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టైసన్ నాయుడు’(Tyson Naidu). కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌కు చెందిన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

ఈ టీజర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. మత విద్వేషాలను రెచ్చగొట్టే కొంతమందిని అంతమొందించడానికి పోలీస్ అధికారులు ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తారు. అదే స్పెషల్ ఆపరేషన్ టీమ్.. దానికి హెడ్‌గా శ్రీనివాస్ కనిపించారు. ఇక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకి హైలైట్‌గా మారనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం (Tyson Naidu) ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : ఫంక్షన్లు, పెళ్లిళ్లు నిర్వహించే వారికి అలర్ట్.. సైబరాబాద్‌లో కొత్త రూల్స్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>