కలం, వెబ్ డెస్క్: అంతర్రాష్ట్ర ఆపరేషన్ లో భాగంగా ఏపీ పోలీసులు మావోయిస్టులకు చెందిన భారీ డంప్ (Maoist Dump) ను వెలికి తీశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఏపీ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, కమిటీ సభ్యుడు మాడివి హిడ్మా (Madvi Hidma) బృందానికి చెందిన డంప్ గా పోలీసులు గుర్తించారు.
బుధవారం ఎటపాక పోలీస్ స్టేషన్ పోలవరం జిల్లా ఎస్పీ చక్రవర్తి ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డంప్ (Maoist Dump) లో 670 బీజీఎల్ షెల్స్, 42 డిటోనెటర్లు, 250 గ్రాముల గన్ పౌడర్, ఇతర పేలుడు తయారీ సామాగ్రి, మందుగుండు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
Also Read : పంజాబ్ లో కుప్పకూలిన ఇనుప వంతెన
Follow Us On : WhatsApp

