కలం, వెబ్ డెస్క్: సైబరాబాద్ (Cyberabad) పరిధిలో భారీగా వేడుకలు, పార్టీలు, శుభకార్యాలు నిర్వహించాలనుకునే వారికి మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై 100 మందికి పైగా హాజరయ్యే ఎలాంటి కార్యక్రమానికైనా ముందస్తు అనుమతితో పాటు చెత్తనిర్వహణ నిబంధనను తప్పనిసరి చేస్తూ కమిషనర్ సృజన కొత్త రూల్స్ (New Rules) తీసుకొచ్చారు.
ఇకనుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 మందికంటే ఎక్కువమంది పాల్గొనే వేడుకలు, పార్టీలు, ఫంక్షన్లు లేదా బహిరంగ సమావేశాలు నిర్వహించేవారు ఈ రూల్స్ (Cyberabad New Rules) పాటించాల్సి ఉంటుంది. అనుమతులు లేని ప్రదేశాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో 100 మందికి పైగా హాజరయ్యే ఎలాంటి కార్యక్రమమైనా జరగడానికి కనీసం 3 పని దినాల ముందే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈవెంట్ ఇంటిమేషన్ పోర్టల్ ద్వారా నిర్వాహకులు తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
అంతే కాకుండా వేడుక జరిగే ప్రాంతంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్త రూపంలో తప్పనిసరిగా వేరు చేయాలనే నిబంధన కూడా తీసుకొచ్చారు. వేరు చేసిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించిన అధీకృత వ్యర్థాల సేకరణదారులు లేదా ఏజేన్సీలకు మాత్రమే అందించాలని తెలిపారు. ఈ కొత్త రూల్స్ పై ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు.
Also Read : కోటి కుటుంబాలకు బీమా.. నేడు సిద్దిపేటకు సీఎం!
Follow Us On: Youtube

