ఆసియా కప్(Asia Cup) 2023 ఛాంపియన్స్ కప్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. పాకిస్థాన్ మంత్రి చేతుల మీదగా కప్ తీసుకోవడానికి నిరాకరించింది. దాంతో కప్‌ను ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ(Mohsin Naqvi).. పాక్‌కు తీసుకెళ్లాడు. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆసియా కప్‌ను భారత్‌కు అప్పగించాలని బీసీసీఐ(BCCI) లేఖ రాస్తే.. టీమిండియా కెప్టెన్‌ను వచ్చి తీసుకోమంటూ నఖ్వీ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిని పరిష్కరించడం కోసం తాజాగా ఐసీసీ రంగంలోకి దిగింది. శుక్రవారం జరిగిన ఐసీసీ బోర్డ్ సమావేశంలో ఈ అంశాన్ని బీసీసీఐ లేవనెత్తింది. తమకు ట్రోఫీని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అందుకు అంగీకరించిన ఐసీసీ.. ఈ సమస్యను పరిస్కరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
బీసీసీఐ, పీసీబీతో మంచి సంబంధాలు ఉన్న ఒమన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీ.. ఈ కమిటీకి నాయకత్వం వహిస్తారని ఐసీసీ వెల్లడించింది. ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి సైకియా మాట్లాడుతూ.. నఖ్వీ నుంచి ట్రోఫీ(Asia Cup) తీసుకునే పనయితే.. ఫైనల్స్ అయినప్పుడే తీసుకుని ఉండేవాళ్లమని అన్నారు. ఈ వివాదం మరింత పెద్దది అవుతున్న క్రమంలో ఐసీసీ మధ్యవర్తిత్వానికి ఓకే చెప్పింది.
Read Also: విజయ్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మిక
Follow Us on : Pinterest

