కలం, వెబ్ డెస్క్: జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో మంగళవారం ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఈ ఎంవోయూ కార్యక్రమమానికి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ హాజరయ్యారు. ఆన్ లైన్ లో జూమ్ ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2028 డిసెంబర్ నాటికి ‘హర్ ఘర్ జల్’ సాకారం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎంఓయూ కుదిరిందని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామాల్లో ఇంటింటికి సురక్షితమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును కేంద్రం తీసుకువచ్చిందన్నారు.
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) మాట్లాడుతూ.. ఏపీలో జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission 2.0) సాకారం అయ్యేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఎంతో కీలకమైన ఈ కార్యక్రమాన్ని పొడిగించాలని సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దీనిని ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు నల్లాలు ఇచ్చామని వివరించారు.

