Mobile Popup Ad
Mobile Popup Ad

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలకు బీసీ సంఘం ఆందోళన

కలం, కరీంనగర్ బ్యూరో : ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీల బంద్ తలపెట్టిన కరీంనగర్ జిల్లా బీసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపుమేరకు నాయకులు మంగళవారం కాలేజీల బంద్ చేపట్టారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అది మల్లేశం పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రాజు మాట్లాడుతూ, స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో మంత్రులను, ఎమ్మెల్యేలను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫీజుబకాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అరెస్టు వల్ల ఉద్యమాన్ని ఆపేది లేదని విద్యార్థుల పక్షాన న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తే మాత్రం రాష్ట్ర అగ్ని గుండంగా మారుస్తామని హెచ్చరించారు. 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆగం చేయొద్దని కోరారు. అరెస్టు అయిన వారిలో అనుమాస నితిన్, రవీంద్ర చారి, నల్లగొని శ్రీనివాస్, ముడుపు ప్రసాద్ బీసీ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>