Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుబంధు కాదు.. రాబందు : కేసీఆర్ పై రేవంత్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : రైతుబంధు కాదు.. రాబంధు బకాయిలు పెడితే తాము వచ్చాక చెల్లిస్తున్నామని.. పరోక్షంగా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా సదస్సులో సీఎం 44.28 లక్షల మంది రైతులకు రూ.2,482 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ధనిక రాష్ట్రంగా ఏర్పడి చివరికి ఇన్ స్టాల్ మెంట్లలో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బకాయిలు పడ్డ ధాన్యం డబ్బులను కూడా కాంగ్రెస్ చెల్లించిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు ఉందన్నారు.

కేసీఆర్ సీఎం అయిన తరువాత 2023 నాటికి రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. పదేళ్లలో ఒకే కుటుంబం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని సీఎం విమర్శించారు. పదేళ్లలో ఒకే కుటుంబం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని సీఎం విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబ అప్పులు తప్పులు చేసి రాష్ట్రాన్ని నిండా ముంచిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>